- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సివిల్స్ 2025 నోటిఫికేషన్ విడుదల
ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను మే 25న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

- 979 పోస్టులను గుర్తించిన యూపీఎస్సీ
- ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తుల స్వీకరణ
- మే 25న ప్రిలిమ్స్
దిశ, నేషనల్ బ్యూరో:
సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2025కు సంబంధించిన నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది సుమారుగా 979 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫకేషన్‌లో పేర్కొన్నారు. ఆశావహులైన అభ్యర్థులు ఫిబ్రవరి 11లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అభ్యర్థులు upsconline.gov.inలో దరఖాస్తు చేసుకోవడానికి ముందు వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలని చెప్పింది. ఈ ఓటీఆర్ జీవితాంతం పని చేస్తుందని, ఇప్పటికే ఓటీఆర్ క్రియేట్ చేసుకున్న వాళ్లు నేరుగా అప్లికేషన్‌ను నింపుకోవచ్చని చెప్పింది. ఓటీఆర్‌లో తప్పులను సరి చేసుకోవడానికి అభ్యర్థులకు ఒక సారి అవకాశం ఇవ్వనున్నారు. ఫ్రెష్‌గా ఓటీఆర్ క్రియేట్ చేసుకున్న వారికి ఫిబ్రవరి 18 వరకు తప్పులను సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అప్లికేషన్లలో తప్పులను సరి చేసుకోవడానికి ఫిబ్రవరి 12 నుంచి 18 వరకు అవకాశం ఇస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను మే 25న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.






