UPSC: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఐఎఫ్ఎస్-2024 ఫలితాలు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-20 08:50:10  IST  )

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)-2024 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష ఫలితాలను అధికారికంగా ప్రకటించింది.

UPSC: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఐఎఫ్ఎస్-2024 ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)-2024 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదలైన ఫలితాల్లో కనిక అనభ్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. పరీక్ష నవంబర్ 24 నుంచి డిసెంబర్ 1, 2024 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఎంపికైన వారికి ఏప్రిల్ 21 నుంచి మే 2, 2025 వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 143 మంది అభ్యర్థులు సివిల్స్‌కు అర్హత సాధించారు. అందులో 40 మంది జనరల్ కేటగిరీ, 19 మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS), 50 మంది ఇతర వెనుకబడిన తరగతుల (OBC), 23 మంది షెడ్యూల్డ్ కాస్ట్ (SC), 11 మంది షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ST) అభ్యర్థులు ఉన్నారు. వైకల్యం ఉన్న వ్యక్తుల (PWBD-1) కోసం రిజర్వ్ చేయబడిన రెండు ఖాళీలకు అర్హత కలిగిన అభ్యర్థులు లేనందున తదుపరి వచ్చే ఆ రెండు స్థానాలకు ఏడాదికి మార్చారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి నల్లగొండ జిల్లాకు చెందిన మిర్యాలగూడ వాసి చాడా నిఖిల్ రెడ్డి 11వ ర్యాంకు సాధించారు. ఇక యొడగూరి ఐశ్వరా రెడ్డి 13వ ర్యాంక్ సొంతం చేసుకుంది.

టాప్ 10 ర్యాంకర్లు వీరే..

1. కనికా అనభ్

2. ఖండేల్వాల్ ఆనంద్ అనిల్కుమార్

3. అనుభవ్ సింగ్

4. జైన్ సిద్ధార్థ్ పరస్మల్

5. మంజునాథ్ శివప్ప నిడోని

6. సంస్కర్ విజయ్

7. మయాంక్ పురోహిత్

8. సనీష్ కుమార్ సింగ్

9. అంజలి సోంధియా

10. సత్య ప్రకాష్

Next Story