- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
UPS: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను నోటిఫై చేశాం.. సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

దిశ, నేషనల్ బ్యూరో: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)ను ఇటీవలే నోటిఫై చేశామని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టు(Supreme court)కు తెలిపింది. ఇది న్యాయ అధికారుల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొంది. కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి (Venkata ramani), సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Thushar mehatha) హాజరై యూపీఎస్‌పై ధర్మాసనానికి తెలియజేశారు. కేంద్రం తరపు న్యాయవాది దాఖలు చేసిన వాదనలను జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. యూపీఎస్ న్యాయ అధికారులతో సహా అన్ని ఉద్యోగుల ఆందోళనలను పరిష్కరించగలదని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను 12వారాల పాటు వాయిదా వేసింది. ఏకీకృత పెన్షన్ పథకం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఈ అంశాన్ని పోస్ట్ పోన్ చేయడమే సముచితమని తెలిపింది. తదుపరి విచారణ అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
కాగా, ఈ ఏడాది జనవరి 25న ఆర్థిక మంత్రిత్వ శాఖ యూపీఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణకు ముందు 12 నెలల పాటు వారి సగటు జీతంలో 50 శాంత పెన్షన్‌గా చెల్లిస్తారు. యూపీఎస్ ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఇందులో జిల్లా న్యాయవ్యవస్థ అధికారులు, పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తులకు పెన్షన్ పంపిణీలో ఆందోళనలు ఉన్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో వాటిపై న్యాయస్థానం విచారణ జరుపుతోంది.