- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
J&K: జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ఫ్యాషన్ షో చిచ్చు
జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ఫ్యాషన్ షో చిచ్చు రేపింది. పవిత్ర రంజాన్ మాసం వేళ జమ్ము కశ్మీర్‌లోని గుల్మర్గ్ లో జరుగిన ఫ్యాషన్ షో వివాదాస్పదంగా మారింది.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ఫ్యాషన్ షో చిచ్చు రేపింది. పవిత్ర రంజాన్ మాసం వేళ జమ్ము కశ్మీర్‌లోని గుల్మర్గ్ లో జరుగిన ఫ్యాషన్ షో వివాదాస్పదంగా మారింది. కాగా.. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఈ వివాదం గందరగోళాన్ని రేకెత్తించింది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో సహా పలువురు రాజకీయ నాయకులు ఆ ఫ్యాషన్ షోని ఖండించారు. దాన్నొక "అశ్లీల" కార్యక్రమన్న నేతలు.. మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందన్నారు. సభ ప్రారంభం కాగానే.. జమ్ముకశ్మీర్ అధికారి నేషనల్ కాన్ఫరెన్స్ (NC), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) సహా మరో ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఈ అంశాన్ని లేవెనత్తారు. ప్రజలు రోజంతా రంజాన్ ఉపవాసాలు పాటిస్తున్నప్పుడు అలాంటి కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దానిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ విషయంపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టినట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. "గుల్మార్గ్‌లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమం ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో ఏ సమయంలోనూ జరగకూడదు. ప్రభుత్వానికి ఈ ఫ్యాషన్ షోతో ఎలాంటి సంబంధం లేదు. నిర్వాహకులు మా నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఇది ఒక హోటల్‌లో నిర్వహించిన ప్రైవేట్ షో. ఆ కార్యక్రమం నిబంధనలను ఉల్లంఘిస్తే ఈ విషయంపై దర్యాప్తుని ప్రభుత్వానికే అప్పగించాలి. నా ప్రభుత్వానికి ఈ విషయంలో ఎలాంటి ప్రమేయం లేదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను" అని ఆయన వివరించారు.
అనవసర రాద్ధాంతం వద్దు- బీజేపీ
అయితే, ఫ్యాషన్ షోపై వివాదం సృష్టించినందుకు ఎన్సీ, పీడీపీ, అలాగే మతాధికారులను బీజేపీ తీర్వంగా విమర్శించింది. ఇదంతా అనవసర రాద్ధాంతం అని మండిపడింది. ఈ అంశంపై బీజేపీ ఎమ్మెల్యే రణబీర్ సింగ్ పఠానియా మాట్లాడుతూ.. "కశ్మీర్ లోయలో సంప్రదాయవాద జ్వాలలు రగిలిపోతున్నాయి. మనం అన్ని రకాల అభిప్రాయాలు, ఆలోచనలను అంగీకరించే విధానాన్ని పెంపొందించుకోవాలి" అని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కామెంట్ల తర్వాత అసెంబ్లీలో దాదాపు అరగంట అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం జరిగింది. స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్ సభ్యులను ప్రశాంతంగా ఉండమని పలుసార్లు అభ్యర్థించారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత సభ్యులకు సమయం ఇస్తానని చెప్పారు. అయినప్పటికీ ఆందోళనలు ఆగలేదు. ముఖ్యమంత్రి ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారని.. అందుకే సభలో దీనిపై చర్చించలేమని ప్రతిపక్షాలకు స్పీకర్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఉత్తర కశ్మీర్ గుల్మార్గ్‌లోని ప్రముఖ స్కై రిసార్టులో ఆదివారం ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారు రెచ్చగొట్టే తరహాలో దుస్తులు ధరించారని స్థానిక మత పెద్దలతో పాటు హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాషన్ షోకు సంబంధించిన చిత్రాలు, వీడియో తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని అన్నారు. సూఫీ, సాధు సంస్కృతి, ప్రజల మతపరమైన దృక్పథానికి పేరుగాంచిన లోయలో దీన్ని ఎలా సహించాలి? అని ప్రశ్నించారు. ఇందులో పాల్గొన్న వారిని వెంటనే జవాబుదారీగా చేయాలి అని మండిపడ్డారు.






