- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిసెంబర్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన UPI ట్రాన్సాక్షన్లు
దేశంలో డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకూ ఆదరణ పొందుతోంది. యూపీఐ వాడకంలో భారత్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకూ ఆదరణ పొందుతోంది. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్) వాడకంలో భారత్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCCI) విడుదల చేసిన డేటా ప్రకారం.. డిసెంబర్ లో మన దేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్లు భారీగా పెరిగాయి. ఒక్క నెలలోనే ఏకంగా 21.6 బిలియన్ లావాదేవీలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటి విలువ రూ.27.97 లక్షల కోట్లుగా నమోదవ్వగా.. గతేడాదితో పోలీస్తే లావాదేవీలు 29 శాతం పెరిగింది.
యూపీఐతోపాటు పెరిగిన ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లు
2025 నవంబర్ నెల కంటే డిసెంబరులో లావాదేవీలు పెరగడంతో.. డిజిటల్ చెల్లింపులకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. డిసెంబరులో రోజువారీ సగటు లావాదేవీల విలువ రూ.90,217 కోట్లుగా ఉండగా.. రోజుకు సగటున 698 మిలియన్ లావాదేవీలు జరిగాయి. యూపీఐ లావాదేవీలతో పాటు IMPS ట్రాన్సాక్షన్లు కూడా పెరిగాయి. డిసెంబర్ నెలలో రూ.6.62 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.
దేశంలో 709 యాక్టివ్ క్యూఆర్ కోడ్స్
ఇక దేశంలో క్యూఆర్ కోడ్స్ వినియోగం కూడా పెరిగింది. వరల్డ్ లైన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. దేశంలో 709 మిలియన్ల యాక్టివ్ యూపీఐ క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. రూ.5 వస్తువు కొన్నా క్యూఆర్ కోడ్ పేమెంట్స్ చేస్తున్నారు. కిరాణాషాపులు, మందుల దుకాణాలు, రవాణా కేంద్రాలు, గ్రామీణ కేంద్రాల్లో స్కాన్ అండే పే ను వాడుతున్నారు. భారత్ డిజిటల్ పవర్ హౌస్ గా మారడంలో ఈ గణాంకాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.






