- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లకు అప్ డేట్.. సిమ్ బైండింగ్ డెడ్‌లైన్ పెంపు?
వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల సిమ్ బైండింగ్ నిబంధనల గడువును కేంద్రం డిసెంబర్ వరకు పొడిగించే అవకాశం ఉంది.

దిశ, డైనమిక్ బ్యూరో: వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్ యూజర్లకు కిలక అప్ డేట్.. ఈ మెసేజింగ్ యాప్‌లకు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనల అమలు గడువును పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. టెలికమ్యూనికేషన్ల శాఖ(DoT) అధికారులు వెల్లడించిన ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లకు గడువు ఇప్పుడు డిసెంబర్ చివరి వరకు పెంచే అవకాశం ఉందని ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయా టెక్ కంపెనీల అభ్యర్థన మేరకు ఈ డెడ్‍లైన్ పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఏంటీ సిమ్ బైండింగ్?:
సిమ్ బైండింగ్ అంటే సిమ్ లేకుండా ఆయా యాప్స్ ఫోన్ లో పనిచేయకుండా ఉండటం. సైబర్ నేరాలు అరికట్టే ఉద్దేశ్యంతో వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రాం లాంటి యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సర్వీసులు తప్పనిసరిగా యాక్టివ్ సిమ్‌కార్డుతో లింక్ అయి ఉండాల్సిందేనంటూ (సిమ్ బైండింగ్) గతేడాది నవంబర్‍లో ఈ నిబంధనలను కేంద్రం తీసుకువచ్చింది. వీటి అమలుకు 90 రోజుల గడవును విధించింది. అయితే ఈ నిబంధనల అమలుకు సాంకేతికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యంగా టెస్టింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్ వంటి విషయంలో సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఆయా యాప్ సంస్థలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాయి. అమలుకు మరికొంత గడవు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.






