మతం మార్చుకోవాలని బలవంతం.. కాదన్నందుకు గొంతుకోసి చంపేస్తానని బెదిరించి..

by Naga Rani Yarlagadda |

ఫేక్ ఐడెంటిటీతో మహిళకు పరిచయమైన వ్యక్తి.. ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకుని మతం మార్చుకోవాలని బలవంతం చేశాడు.

మతం మార్చుకోవాలని బలవంతం.. కాదన్నందుకు గొంతుకోసి చంపేస్తానని బెదిరించి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఫేక్ ఐడెంటిటీతో మహిళకు పరిచయమైన వ్యక్తి.. ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకుని మతం మార్చుకోవాలని బలవంతం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వెలుగుచూసింది. తాను మతం మారేందుకు నిరాకరించడంతో తనపై దాడిచేసి, బ్లాక్ మెయిల్ చేశాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం లక్నోలోని చిన్హాట్ ప్రాంతంలో నివసిస్తోన్న 25 ఏళ్ల మహిళ 2023లో బీబీడీ విశ్వవిద్యాలయంలోని హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో చేరింది. ఆమె తండ్రి చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2024 ఆగస్టులో చదువుకు దూరమయింది. తనను తాను పోషించుకునేందుకు చిన్న ఫుడ్ స్టాల్ ను ప్రారంభించింది.

అలా వ్యాపారం చేసుకుంటున్న మహిళకు బారాబంకికి చెందిన రాజ్ అనే పేరుతో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈ క్రమంలో అతను ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. 2024 దీపావళి సమయంలో బడా ఇమాంబారాను సందర్శించినపుడు ఆ వ్యక్తి అసలు పేరు మొహమ్మద్ ఫుర్ఖాన్ అని, తన ఒరిజినల్ ఐడెంటిటీని దాచి తనతో స్నేహంగా ఉన్నాడని గుర్తించింది. అందుకే తనను ఇస్లాం మతంలోకి మార్చాలని ప్రయత్నించాడని, వ్యతిరేకించినందుకు శారీరకంగా వేధించి, గొంతుకోసి చంపేస్తానని బెదిరించినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తన అశ్లీల ఫొటోలను కూడా ఆన్లైన్లో విడుదల చేస్తానని బెదిరించాడని మహిళ చెప్పింది.

ఆగస్టు 7వ తేదీన తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోకి బలవంతంగా వచ్చి బెదిరించాడని, ఆగస్టు 11న ఇంట్లో లేని సమయంలో వెళ్లి తాళం పగలగొట్టి రూ.25000 దొంగతనం చేశాడని ఆరోపించింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చిన్హాట్ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Next Story