- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థినులకు ఉచిత స్కూటీలు
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను యూపీ అసెంబ్లీలో రూ.8.08 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

- పథకం అమలుకు రూ.400 కోట్లు కేటాయింపు
- మహారాణి లక్ష్మీబాయి పేరుతో అమలు
- వెల్లడించిన యూపీ సీఎం ఆదిత్యానాథ్
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతిభావంతమైన విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు అందించనుంది. ఇందు కోసం 2025-26 బడ్జెట్‌లో రూ.400 కోట్ల ప్రాథమికంగా కేటాయించినట్లు గురువారం ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యానాథ్ వెల్లడించారు. ఈ స్కీమ్‌కు స్వాతంత్ర సమరయోధురాలు మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయి పేరు పెట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో మహిళలను కేంద్రంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు కౌంటర్‌గా బీజేపీ లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర్‌ను ప్రకటించింది. ఇందులో మహిళలకు ఉచితంగా స్కూటీలు అందిస్తామని హామీ ఇచ్చింది యూపీలో విద్యార్థులు విద్యలో మరిన్ని అవకాశాలు పొందాలని, మహిళా సాధికారతకు గుర్తుగా ఉండాలనే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం యోగీ ఆదిత్యానాథ్ తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో అర్హులైన వారికి స్కూటీలు అందిస్తామని సీఎం ఆదిత్యానాథ్ పేర్కొన్నారు.
ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను యూపీ అసెంబ్లీలో రూ.8.08 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరం కంటే 9.8 శాతం అధికం. అయితే యూపీ బడ్జెట్‌పై సమాజ్ వాది పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ స్పందించారు. రైతులకు బీజేపీ ఇచ్చిన హామీలు పెరుగుతున్నాయి. కానీ రైతుల సమస్యలు మాత్రం తీరడం లేదని దుయ్యబట్టారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సాగునీటి కోసం ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని నెరవేర్చడంలో ఆదిత్యానాథ్ ప్రభుత్వం విఫలమయ్యిందని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.






