చనిపోయేటపుడు చేపలు ఎంత వేదనను భరిస్తాయో తెలుసా.. తాజా అధ్యయనంలో వెల్లడైన నిజాలివే..

by Naga Rani Yarlagadda |

ప్రతి సంవత్సరం ట్రిలియన్ (లక్షల కోట్లు) చేపలు నీటి నుండి వెలికితీస్తున్నారు. ఇవన్నీ ఎక్కువగా మన పళ్లెంలోకి చేరే ఆహారంగా మారుతుంటాయి.

చనిపోయేటపుడు చేపలు ఎంత వేదనను భరిస్తాయో తెలుసా.. తాజా అధ్యయనంలో వెల్లడైన నిజాలివే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి సంవత్సరం ట్రిలియన్ (లక్షల కోట్లు) చేపలు నీటి నుండి వెలికితీస్తున్నారు. ఇవన్నీ ఎక్కువగా మన పళ్లెంలోకి చేరే ఆహారంగా మారుతుంటాయి. కానీ ఈ చేపల్ని చంపే పద్ధతులు వాటి జీవితం చివరిదశలో తట్టుకోలేని వేదనను కలిగిస్తున్నాయని తాజాగా సైంటిఫిక్ రిపోర్ట్స్ లో పబ్లిష్ అయిన ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

రెయిన్‌బో ట్రౌట్ (Rainbow Trout) అనే చేపలు సాధారణంగా తుడిపాటి నీళ్లలో నివసించే చేపలు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అవి వాణిజ్యపరంగా పెంపకం అవుతున్నాయి. వీటిని ఎక్కువగా అస్ఫిక్సియేషన్ (శ్వాస రోధన) పద్ధతిలో అంటే గాలిలో లేదా మంచు నీటిలో ఉంచడం ద్వారా చంపుతారు. ఈ విధానంలో ఒక్కో చేపకు 2 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు తీవ్ర వేదన అనుభవంలోకి వస్తుందని పరిశోధకులు వెల్లడించారు. సగటుగా ఒక్క కిలోగ్రాం చేపలకు 24 నిమిషాల మోతాదైన బాధ సంభవిస్తుందని కూడా పేర్కొన్నారు

ఒక్క 5 సెకన్ల గాలి పరిచయం వల్ల చేపల మేధస్సులో మనుషులలో కనిపించే నెగెటివ్ ఎమోషన్లను కలిగించే న్యూరోకెమికల్ మార్పులు జరుగుతాయి. ఆ తర్వాత చేపలు వేగంగా మెలికలు తిప్పుతూ, తిరుగుతూ, తీవ్రమైన బాధను వ్యక్తం చేస్తాయి. గాలి లేకపోవడంతో గిల్లులు (gills) అతుక్కుపోతాయి. శ్వాస ఆగుతుంది. CO2 పెరిగి నొప్పిని కలిగించే 'నోసిసెప్షన్' (Nociception) క్రియలు ప్రారంభమవుతాయి. చివరికి.. అధిక CO2 వలన రక్తం, మెదడు ద్రవాలు ఆమ్లతను పొంది స్పృహ కోల్పోతాయి. ఈ మొత్తం ప్రక్రియ 22 నిమిషాల వరకు నొప్పితో కొనసాగుతుందన్నది ఈ అధ్యయనం గుండెను పిండే నిజం.

వెల్ఫేర్ ఫుట్‌ప్రింట్ ఫ్రేమ్‌వర్క్ (Welfare Footprint Framework) అనే ప్రమాణం ఆధారంగా చేపలు మరణానికి ముందు అనుభవించే మానసిక, శారీరక బాధలను కొలిచారు. ఇది శాస్త్రవేత్తలు, మత్స్యకారులు, నైతిక ప్రమాణాలను పాటించే వ్యవసాయ కార్మికులకు ఆచరణలో మార్గదర్శిగా పనిచేస్తుంది.

చేపలు బాధను తగ్గించేందుకు.. శాస్త్రవేత్తలు ఎలక్ట్రిక్ స్టన్నింగ్ అనే పద్ధతిని సూచిస్తున్నారు. ఇది చేపను వెంటనే స్పృహ కోల్పోయేలా చేసి మరణాన్ని తక్కువ బాధతో కలిగించే మార్గమని అధ్యయనం చెబుతోంది. కానీ ప్రస్తుత విధానాల్లో ఈ స్టన్నింగ్ పద్ధతులు సరైన రీతిలో అమలవడం లేదని, లేదా ముందుగానే కలిగే స్ట్రెస్ వల్ల సరిగ్గా పనిచేయడం లేదని కూడా వారు హెచ్చరిస్తున్నారు.

ఏదేమైనా.. మనం బ్రతకడం కోసం, మన ఆహారం కోసం మరో జీవిని ఇలా హింసించి చంపడ ఎంతవరకూ కరెక్టో ఆలోచిచాలంటున్నారు జంతు ప్రేమికులు, పర్యావరణ వేత్తలు. మనుషులు శాకాహారులైతే జంతువులు కూడా మరణభయం లేకుండా జీవించగలుగుతాయని చెప్తున్నారు.

Next Story