Kanwar Yatra: భక్తుల పాదాలకు పోలీస్ అధికారి మసాజ్! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? వీడియో వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-07-19 07:15:04  IST  )

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Kanwar Yatra: భక్తుల పాదాలకు పోలీస్ అధికారి మసాజ్! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భక్తుల పాదాలకు ఓ మహిళా పోలీసు ఉన్నతాధికారి మసాజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. వివరాల్లోకి వెలితే.. ఉత్తరాదిలో శివ భక్తుల (Kanwar Yatra) కన్వర్ (కావడి యాత్ర) యాత్ర ప్రారంభం అయిన విషయం తెలిసిందే. భక్తులను కన్వారియాలు అని పిలుస్తారు. ఈ యాత్రలో భక్తులు హరిద్వార్, గంగోత్రి, లేదా గౌముఖ్ వంటి ప్రదేశాల నుంచి గంగా నది నీటిని సేకరించి, తమ ఊరిలోని శివాలయాలకు తీసుకెళ్లి, శివలింగంపై ఆ నీటిని పోసి పూజిస్తారు. అయితే తమ భూజలపై వెదురు నిర్మాణం (కావడి)కి ఇరువైపుల కుండలు కడతారు. లక్షలాది మంది భక్తులు కాలినడకన గంగా జలాన్ని మోసుకుంటూ తమ ప్రాంతాలకు వెళ్తుంటారు.

భక్తులకు మార్గ మధ్యలో ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా యూపీ పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు, విశ్రాంతి తీసుకునే ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రిషికా సింగ్ (DSP Rishika Singh) తాజాగా వార్తల్లో నిలిచారు. కావడితో కాలినడకన ప్రయాణిస్తున్న మహిళా, చిన్నారి కన్వారియాలకు రిషికా సింగ్ కాసేపు సేవ చేసి.. అందరి మనసును గెలిచారు.

వీడియోలో చూపించిన ప్రకారం.. కావడితో కాలినడకన ప్రయాణిస్తున్న మహిళా, చిన్నారి కన్వారియాలకు రిషికా సింగ్ కాసేపు సేవ చేశారు. మహిళా భక్తుల పాదాలకు మసాజ్ చేసి.. వారి నుంచి యాత్ర విశేషాలు తెలుసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారి అయిన కూడా కొంత మంది భక్తుల పాదాలకు ఆమె మసాజ్ చేయడంపై నెటిజన్‌లు ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా మంది రాజకీయ నాయకులు, నెటిజన్లు అధికారి వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. కాగా, లక్నోకు చెందిన రిషికా సింగ్.. 2022 లో యూపీపీఎస్సీ ద్వారా 80 వ ర్యాంకు సాధించి.. యూపీ పోలీస్ శాఖలో డీఎస్పీ గా విధులు నిర్వహిస్తున్నారు. వీడియో కోసం క్లిక్ చేయండి..

Next Story