- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎక్స్‌ప్రెస్‌వేపై యువతుల 'నాగిని డాన్స్'.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యూపీ పోలీసులు!
జాతీయ రహదారిపై ఇద్దరు యువతులు చేసిన 'నాగిని డాన్స్'కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ యూపీ సోలీసులు తాజాగా వీడియో షేర్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం కొంత మంది యువత ఎంతటి సాహసానికైనా వెనుకాడటం లేదు. ఇటీవల కాన్పూర్-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఇద్దరు యువతులు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. జాతీయ రహదారిపై వారు చేసిన 'నాగిని డాన్స్'కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ యూపీ సోలీసులు తాజాగా వీడియో షేర్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉన్నావ్ జిల్లాలోని కాజల్ గదన్ ఖేడా బైపాస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైరల్ వీడియోలో ఇద్దరు యువతులు హైవే మధ్యలో నిలబడి రీల్స్ చేస్తున్నారు. ఒక యువతి పామును ఆడించే వ్యక్తిలా నటిస్తుంటే, మరో యువతి ఏకంగా రోడ్డుపై దొర్లుతూ 'నాగిని' స్టెప్పులు వేసింది. భోజ్‌పురి పాటలకు వారు వేసిన స్టంట్లు చూసి నెటిజన్‌లు ఆశ్చర్యపోయారు. కాగా, రాత్రి సమయంలో వారు హైవేపై డాన్స్ చేస్తున్నప్పుడు ఎలాంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి న్యూసెన్స్ జరగలేదు.
యూపీ పోలీసుల 'సెటైరికల్' ట్వీట్
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఓ నెటిజన్ ఈ వీడియోను ఉన్నావ్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ.. ‘సార్, ఈ నాగిని డాన్స్ ఎలా ఉంది? పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఇలాంటి వారు రోడ్ల మీదకు వస్తూనే ఉంటారు’ అని ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన ఉన్నావ్ పోలీసులు, కొత్వాలీ సదర్ ఇన్‌స్పెక్టర్‌ను విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఈ ఘటనపై కేసు (FIR) నమోదు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఘటనపై తాజాగా ఉత్తరప్రదేశ్ పోలీసులు తమదైన శైలిలో స్పందించారు. ‘నాగిని స్టెప్పులు పర్ఫెక్ట్‌గా ఉన్నాయి.. కానీ లొకేషన్ మాత్రం ఫ్లాప్! సపేరా (పాము పట్టేవాడు - ఇక్కడ పోలీసులు) వచ్చాడు.. షో స్టాప్ అయింది!’ అంటూ యూపీ పోలీస్ ట్వీట్‌లో వీడియో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.






