- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నం కాదు.. విషం తిను.. భర్తను వదిలేసి పక్కింటి ప్రియుడితో లేచిపోయిన భార్య.. భరించలేక...
యూపీ హర్దోయిలో దారుణం చోటు చేసుకుంది. నలుగురు పిల్లల తల్లి పక్కింటి ప్రియుడితో లేచిపోయింది. దీంతో ఈ బాధను భరించలేని భర్త నాలుగు రోజులకే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. 45ఏళ్ల సర్వేష్ తన భార్య రింకిని అపురూపంగా చూసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు కూడా

దిశ, వెబ్ డెస్క్ : యూపీ హర్దోయిలో దారుణం చోటు చేసుకుంది. నలుగురు పిల్లల తల్లి పక్కింటి ప్రియుడితో లేచిపోయింది. దీంతో ఈ బాధను భరించలేని భర్త నాలుగు రోజులకే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. 45ఏళ్ల సర్వేష్ తన భార్య రింకిని అపురూపంగా చూసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు కూడా. అయితే పెళ్లి అయినప్పటి నుంచి అన్యోన్యంగా ఉన్న ఇద్దరి మధ్యలోకి పక్కింటి హకీమ్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ప్రేమ పేరుతో రింకికి బ్రెయిన్ వాష్ చేశాడు. తనతో వచ్చేస్తే నచ్చిన విధంగా ఎంజాయ్ చేయొచ్చని మాయమాటలు చెప్పాడు. దీంతో అతనికి పడిపోయిన రింకి.. కొన్నాళ్లుగా అక్రమ సంబంధంలో ఉంది. నాలుగు రోజుల క్రితం భర్త, పిల్లలను వదిలేసి అతనితో లేచిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న భర్త.. తిరిగి రావాలని బతిమాలుతూ ఫోన్ చేశాడు. కానీ రింకి.. నువ్వు అన్నం తింటావో.. విషం తింటావో.. నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేసింది. దీంతో నాలుగు రోజులుగా కనీసం నీరు కూడా ముట్టుకోకుండా ఉన్న ఆయన చివరకు పాయిజన్ తీసుకుని చనిపోయాడు. ఈ విషయాన్ని సర్వేష్ కొడుకు లక్కీ పోలీసులకు వివరించాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






