కదులుతున్న కారులో ఘోరం: ఓ బాలికపై గ్యాంగ్ రేప్, మరో బాలిక దారుణ హత్య

by Vemula.Srinu Prasad |

కదులుతున్న కారులో మైనర్‌పై సామూహిక అత్యాచారం జరిగింది....

కదులుతున్న కారులో ఘోరం:  ఓ  బాలికపై గ్యాంగ్ రేప్, మరో బాలిక దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: కదులుతున్న కారు(Car)లో మైనర్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదే(Uttarpradesh)శ్‌లో జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని గ్రేటర్ నోయిడా(Greater Noida)కు చెందిన వ్యక్తి ఇద్దరు బాలికల(Girls)ను లక్నో తీసుకెళ్లారు. అయితే కారులో మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారంతా బీర్లు తాగుతున్నారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఓ బాలికను బయటకు నెట్టేశారు. దీంతో ఆమె కింద పడి చనిపోయారు. అనంతరం మరో బాలికపై అత్యాచారం చేశారు. అయితే ఈ బాలిక బలంద్ పహర్ జిల్లా ఖుర్జాలో తప్పించుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారును వెంబడించి ముగ్గురు నిందితులు సందీప్, అమిత్, గౌరవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Next Story