మీరంతా స్వర్గానికి వెళతారు..వరద బాధితులతో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

అప్ప‌టికే వ‌ర‌ద‌ల కార‌ణంగా స‌ర్వ‌స్వం కోల్పోయిన బాధితుల‌తో ఓ మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శించడానికి వెళ్లిన

మీరంతా స్వర్గానికి వెళతారు..వరద బాధితులతో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: అప్ప‌టికే వ‌ర‌ద‌ల కార‌ణంగా స‌ర్వ‌స్వం కోల్పోయిన బాధితుల‌తో ఓ మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శించడానికి వెళ్లిన మంత్రి ఆ పనిచేయ‌కుండా వారితో ఎట‌కారంగా మాట్లాడారు. దీంతో ప్ర‌స్తుతం ఆ మంత్రి తీరు వివాదాస్ప‌దంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవ‌ల ఉత్త‌రప్ర‌దేశ్ రాష్ట్రంలో వ‌ద‌ర‌లు భీబ‌త్సం సృష్టించాయి. రాష్ట్రంలోని 402 గ్రామాలు నీట మునిగాయి. వాటిలో కాన్పూర్ దెహాత్ జిల్లాలోని గ్రామాలు కూడా ఉన్నాయి. కాగా మంత్రి సంజ‌య్ నిషాత్ జిల్లాలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌ను ప‌రామ‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా బాధితులు అంతా మంత్రి వ‌ద్ద‌కు చేరుకుని వ‌ర‌ద‌ల కార‌ణంగా స‌ర్వ‌స్వం కోల్పోయామ‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నారు. క‌ట్టు బ‌ట్టుల‌తో స‌హా అన్నీ కోల్పోయామ‌ని అన్నారు. దీంతో మంత్రి సంజ‌య్..గంగ‌మ్మత‌ల్లి త‌న బిడ్డ‌ల పాదాలు క‌డ‌గ‌టానికి వస్తుంది. ఆ ద‌ర్శ‌నంతో మీరంతా స్వ‌ర్గానికి వెళ‌తారు. విప‌క్షాలు మిమ్మ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయి. అంటూ వ్యాఖ్యానించారు. నిజానికి మంత్రి పరామ‌ర్శించిన గ్రామాలు య‌మునా న‌ది ఒడ్డున ఉన్నాయి. కానీ ఆయ‌న ఎక్క‌డు వ‌చ్చాడో కూడా తెలియ‌కుండా గంగా న‌ది అని మాట్లాడ‌టంతో వ‌ర‌ద బాధితులు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. వీడియో నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు సైతం మంత్రి తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. video

Next Story