- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UP: కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. సీఎం యోగి ఆదిత్యానాథ్ పరిశీలన
ఉత్తర ప్రదేశ్(Uttarapradesh) లోని ప్రయాగ్ రాజ్(Prayag Raj) లో జరుగుతున్న మహా కుంభమేళాలో(Maha Kumbhamela) భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్(Uttarapradesh) లోని ప్రయాగ్ రాజ్(Prayag Raj) లో జరుగుతున్న మహా కుంభమేళాలో(Maha Kumbhamela) భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. కుంభమేళాలో ఏర్పాటు చేసిన టెంట్లలో గ్యాస్ సిలిండర్లు పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీని ద్వారా చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఇతర గుడారాలకు అంటుకొని, దాదాపు 30 గుడారాలు మంటల్లో చిక్కుకున్నాయి. మంటలు వ్యాపించడంతో భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్(CM Yogi Adithyanath) మహాకుంభమేళాలోని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదం గురించి అక్కడి అధికారులను ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే ఈ ఘటనలో భక్తులకు ఎవరికైనా ప్రమాదం జరిగిందా అనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక అగ్ని ప్రమాదంలో నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వే చేపట్టాలని సూచించారు. ఇక కుంభమేళాకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తుంటారని, ఏర్పాట్లలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.






