- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలపై నేరాల్లో యూపీ ముందు వరుసలో ఉంది! ఎస్పీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
సమాజ్ వాది చీఫ్, కన్నౌజ్ ఎంపీ.. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: సమాజ్ వాది చీఫ్, కన్నౌజ్ ఎంపీ.. అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ట్రెయినీ డాక్టర్ హత్యపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. యూపీ ప్రభుత్వ ప్రతిష్టను మంటకలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు.
అయితే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. లక్నోలో ఇవాళ(మంగళవారం) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ.. "యూపీలోని కన్నౌజ్, ఫరక్కా బాద్ లాంటి ప్రాంతాల్లో నిత్యం అనేక ఘటనలు జరుతున్నాయని, మహిళలపై నేరాలకు సంబంధించిన విషయంలో ఉత్తర ప్రదేశ్ ముందు వరుసలో ఉందని అన్నారు. యూపీలో ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదని, అందుకే రాష్ట్రంలో మహిళలపై వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రంలో మహిళలే కాదు, ప్రతి పౌరుని భద్రతకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజల పట్ల యోగి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వం తమ బాధ్యతలను విస్మరించడం వల్లనే రాష్ట్రంలో అమాయక ప్రజలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టాల్సి వస్తుంది" అని అఖిలేష్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.






