రూ.31 లక్షల కట్నం వద్దంటే వద్దన్న వరుడు.. రూపాయి తీసుకొని పెళ్లి!

by Phanindra |

రూ.31 లక్షల కట్నం ఇస్తుంటే వద్దని గొడవ చేశాడో వరుడు. కేవలం రూపాయి తీసుకొని పెళ్లి చేసుకున్నాడు.

రూ.31 లక్షల కట్నం వద్దంటే వద్దన్న వరుడు.. రూపాయి తీసుకొని పెళ్లి!
X

దిశ, నేషనల్ బ్యూరో: వరకట్నానికి వ్యతిరేకంగా ఒక వరుడు చేసిన పని వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన అవధేష్ రాణా అనే యువకుడు.. అదితి సింగ్ అనే అమ్మాయిని కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో వరుడికి రూ.31 లక్షలు వరకట్నంగా తీసుకొచ్చారు వధువు తల్లిదండ్రులు. ఆ సొమ్ము చూసిన అవధేష్ చేతులు జోడించి వారికి నమస్కరించాడు. కానీ ఆ సొమ్ము తీసుకోవడానికి ససేమిరా అన్నాడు. అత్తమామలు బలవంతం చేసినా సరే కట్నం తీసుకోనంటే తీసుకోనని భీష్మించుకున్నాడు.

చివరకు అత్తమామల సంతోషం కోసం కేవలం ఒక్క రూపాయి తీసుకొని వధువు మెడలో తాళికట్టాడు. అతను చేసిన పని చూసిన అతిథులంతా కరతాళ ధ్వనులతో అతన్ని మెచ్చుకున్నారు. తమ కుటుంబం వరకట్న విధానానికి పూర్తి వ్యతిరేకమని, ఇది పూర్తిగా తప్పుడు చర్య అని రాణా వివరించారు. అసలు వరకట్న వ్యవస్థనే తుడిచిపెట్టేయాలని డిమాండ్ చేశారు. అతను చేసిన పనికి నెట్టింట కూడా మద్దతు లభిస్తోంది. ఇలాంటి వాళ్లు మరింతమంది సమాజానికి కావాలని సోషల్ మీడియా యూజర్లు కామెంట్ చేస్తున్నారు.

Next Story