- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లివ్-ఇన్ రిలేషన్ ధోరణిపై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
యువతలో పెరుగుతున్న లివ్-ఇన్ రిలేషన్ ధోరణిపై ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: యువతలో పెరుగుతున్న లివ్-ఇన్ రిలేషన్ (Leave-in relationship) ధోరణిపై ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ (Anandiben Patel) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వారణాసిలో జరిగిన ఒక మహిళా విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ క్రమంలో.. నేటి సమాజంలో పెరుగుతున్న చెడు సంబంధాలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా లివ్-ఇన్ రిలేషన్ వంటి సంబంధాలు మొదట ఆకర్షణీయంగా కనిపించినా, వాటి ఫలితాలు చాలా బాధాకరంగా ఉంటాయని, లివ్-ఇన్ రిలేషన్‌లో ఉండి గర్భం దాల్చిన అమ్మాయిలు, చివరికి ఒంటరిగానే బిడ్డలను కనడం, ఆ పిల్లలు అనాథాశ్రమాల్లో చేరడం వంటి దుస్థితులు జరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు.
నిజంగా ఈ సంబంధాల ఫలితాలను చూడాలంటే అనాథాశ్రమాలకు వెళ్లి చూడండి. 15 నుంచి 20 సంవత్సరాల వయస్సు గల అమ్మాయిలు, ఒక్కో సంవత్సరం పిల్లలతో కనిపిస్తారు,” అని గవర్నర్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆనందీబెన్ పటేల్ యువతులకు బలమైన సందేశం ఇస్తూ.. “స్వేచ్ఛ అనే పేరుతో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని దెబ్బతీయవచ్చు. వివాహం మనకు సామాజిక భద్రతను ఇస్తుంది, కానీ లివ్-ఇన్ రిలేషన్ తాత్కాలిక సంతోషం మాత్రమే ఇస్తాయి.
జీవిత విలువలు, కుటుంబ బంధాలు ముఖ్యమని గుర్తుంచుకోండి,” అని ఆమె పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గవర్నర్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు ఆమె అభిప్రాయాలను సమర్థిస్తూ యువతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుండగా, మరికొందరు మాత్రం ఈ వ్యాఖ్యలను మహిళల స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు.






