- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమా స్టైల్‌లో భర్త హత్య.. కత్తిపోటుకు చావలేదని కాల్చి చంపిన భార్య..
పుట్టింటికి తీసుకెళ్లి భర్తను దారుణంగా హతమార్చిన భార్య.. ప్రియుడితో కలిసి మర్డర్ ప్లాన్.. దారిలోనే ఎటాక్ చేసి.. క్లైమాక్స్ లెవల్ ట్విస్ట్..

దిశ, వెబ్ డెస్క్ : యూపీ షమ్లీలో భర్తను హత్య చేసింది భార్య. నవ్వుతూ కనిపిస్తూనే చేయాల్సిన పని చేసేసింది. మఫ్రిన్, షహన్వాజ్ ఇద్దరు భార్యాభర్తలు. ఇన్నాళ్లు కాపురం బాగానే సాగినా.. వీరి మధ్యలోకి తసవ్వూర్ ఎంటర్ అయ్యాడు. మఫ్రిన్‌తో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన భర్త.. భార్యను హెచ్చరించాడు. దీంతో అతన్ని లేపేసేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే మఫ్రిన్ పెళ్లికి వెళ్దామని.. భర్తను సోనిపట్ నుంచి షమ్లీలోని తన పుట్టింటికి తీసుకెళ్లింది. బైక్‌పై వెళ్తుండగా.. మధ్యలోనే వీరిపై ప్రియుడితో సహా కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు. మఫ్రిన్‌ను దూరంగా తీసుకెళ్తూ.. భర్తను మాత్రం దారుణంగా కత్తితో పొడిచారు. ఈ సమయంలో పక్క నుంచి భార్య.. త్వరగా పని పూర్తి చేయమని అరుస్తుండటంతో.. కాల్చి చంపారు.
ఇక ఈ ఘటన జరిగాక పోలీసులతో తమపై దొంగలు ఎటాక్ చేశారని వివరించింది. కానీ తను చెప్పే మాటలతో కన్విన్స్ కాని పోలీసులు తమ స్టైల్‌లో విచారించారు. జస్ట్ గంటల వ్యవధిలో ఈ హత్య చేసింది భార్యనే అని తేల్చారు. భార్య, ప్రియుడితోసహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.






