- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్తను హత్య చేసిన కోడలు.. సంచలనం రేపుతున్న ఘటన
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని డెమూసా గ్రామంలో దారుణ ఘటన జరిగింది. కోడలు సీమా దేవి అత్త రాజ్‌పతి దేవి తలను గోడకు బాది రక్తం కళ్ల చూసింది. ఆ తర్వాత రాజ్‌పతిని బీఆర్‌డీ

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో క్రైమ్ రేట్ భారీగా పెరిగిపోతోంది. క్షణికావేశంలో అయిన వారినే హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్‌లోని డెమూసా గ్రామంలో దారుణ ఘటన జరిగింది. కోడలు సీమా దేవి అత్త రాజ్‌పతి దేవి తలను గోడకు బాది రక్తం కళ్ల చూసింది. ఆ తర్వాత రాజ్‌పతిని బీఆర్‌డీ మెడికల్ కాలేజీలో చికిత్స కోసం తరలించినా ఫలితం లేకుండా పోయింది. గాయాల కారణంగా అధిక రక్తస్రావం కావడంతో మరణించింది. దీంతో కోడలిని అరెస్టు చేసిన పోలీసులు.. మొదట హత్యాయత్నం (సెక్షన్ 307 ఐపీసీ) కింద నమోదైన కేసును.. తర్వాత హత్యకు సమానమైన నేరం (సెక్షన్ 304 పార్ట్ I ఐపీసీ) కిందకు మార్చారు. కుటుంబ వివాదాలు ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆస్తి కోసమే ఇదంతా చేసిందని సమాచారం.
Next Story






