పరువు హత్యలు.. గుండు గీయించి.. ఊపిరాడకుండా గొంతు బిగించి.. చిల్లింగ్ మర్డర్స్..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో పరువు హత్యలు కలకలం రేపాయి. రక్షాబంధన్ రోజునే అన్న సోదరిని దారుణంగా హత మార్చాడు. అంతకు ముందే సోదరి ప్రియుడిని కూడా చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కుమారి సహోదర్, విశాల్ అహిర్వార్ ప్రేమించుకుని, పారిపోయి పెళ్లి చేసుకున్నారు. జనవరిలో ఈ

పరువు హత్యలు.. గుండు గీయించి.. ఊపిరాడకుండా గొంతు బిగించి.. చిల్లింగ్ మర్డర్స్..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో పరువు హత్యలు కలకలం రేపాయి. రక్షాబంధన్ రోజునే అన్న సోదరిని దారుణంగా హత మార్చాడు. అంతకు ముందే సోదరి ప్రియుడిని కూడా చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కుమారి సహోదర్, విశాల్ అహిర్వార్ ప్రేమించుకుని, పారిపోయి పెళ్లి చేసుకున్నారు. జనవరిలో ఈ ఘటన జరగ్గా.. ఇరు కుటుంబాల ఒప్పందంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. ఎవరి ఇంట్లో వారు ఉంటున్నారు. కానీ ఈ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కొనసాగుతున్న విషయం కుమారి సోదరుడు అరవింద్ కుమార్‌కు తెలిసింది. దీంతో తన ఫ్రెండ్ ప్రకాశ్‌తో కలిసి మర్డర్ ప్లాన్ చేశాడు.

ఆగస్టు 7న అరవింద్, ప్రకాశ్.. విశాల్‌ను ఢిల్లీలో ఉద్యోగం ఉందని నమ్మించి అతని గ్రామం ప్రథాయ్ నుంచి తీసుకెళ్లారు. అతడిని ఊపిరాడకుండా గొంతు నులిమి చంపేసి.. గుడా విలేజ్ సమీపంలోని ధసన్ నది దగ్గర పడేశారు. ఆ తర్వాత రక్షా బంధన్ రోజు అంటే ఆగస్టు 9న.. మెడిసిన్ తీసుకొద్దామని చెల్లిని తీసుకుని వెళ్లాడు అరవింద్. ఆమెకు గుండు చేసి.. ఊపిరాడకుండా చేసి.. చంపి.. ఊరికి దూరంగా ఉన్నరాతి కొండపై పడేశాడు. ఆ తర్వాత రోజు గ్రామస్తులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అరవింద్, ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Next Story