72ఏళ్ల వృద్ధుడితో సెక్స్.. న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. భరించలేక..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ పోలీసులు హనీట్రాప్ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాణి, మహక్, రాహుల్ శర్మ, రాధేశ్యామ్‌లను అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ శృంగారాన్ని వలగా వేసి టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలోనే 72 సంవత్సరాల వృద్ధుడైన కోఆపరేటివ్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ అధికారి రూప్ కిషోర్‌ను లక్ష్యంగా చేసుకుంది

72ఏళ్ల వృద్ధుడితో సెక్స్.. న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. భరించలేక..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ పోలీసులు హనీట్రాప్ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాణి, మహక్, రాహుల్ శర్మ, రాధేశ్యామ్‌లను అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ శృంగారాన్ని వలగా వేసి టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలోనే 72 సంవత్సరాల వృద్ధుడైన కోఆపరేటివ్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ అధికారి రూప్ కిషోర్‌ను లక్ష్యంగా చేసుకుంది. వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా అతనితో స్నేహం చేసి.. లైంగిక సంబంధాల వాగ్దానంతో ఆకర్షించి.. అతనితో సెక్స్ చేసి.. న్యూడ్ వీడియోలు తీశారు. ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి.. ₹10 లక్షలు డిమాండ్ చేశారు. టార్చర్ భరించలేని వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. డబ్బు తీసుకునేందుకు వచ్చిన నలుగురు నిందితులను పక్కా ప్లాన్‌తో పోలీసులు పట్టుకున్నారు. అయితే మరో ఇద్దరు.. అమన్, సోనూ శర్మ పరారీలో ఉన్నారు.

ఇతర బాధితులు ఫిర్యాదు చేయకపోయినప్పటికీ.. నిందితుల విచారణలో ఈ గ్యాంగ్ 20 నుంచి 30 మందిని లక్ష్యంగా చేసుకుని భారీ మొత్తాలను గుంజినట్లు తెలిసింది. పోలీసులు ₹50,000 నగదు.. నాలుగు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాల్ వివరాలు, చాట్ రికార్డులను విశ్లేషిస్తున్నారు. పరారీలో ఉన్న వారిని పట్టుకోవడానికి, గ్యాంగ్ కార్యకలాపాల పూర్తి వివరాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.





Next Story