యూపీలో దారుణం.. ఐదేళ్ల బాలికపై అన్న అత్యాచారం.. సంచలనం రేపుతున్న ఘటన

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలికపై అత్యాచారం ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 9న రాఖీ రోజే ఈ ఘటన జరగడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐదేళ్ల చిన్నారి రక్షా బంధన్ రోజున తన కజిన్ బ్రదర్‌కు రాఖీ కట్టింది.

యూపీలో దారుణం.. ఐదేళ్ల బాలికపై అన్న అత్యాచారం.. సంచలనం రేపుతున్న ఘటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలికపై అత్యాచారం ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 9న రాఖీ రోజే ఈ ఘటన జరగడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐదేళ్ల చిన్నారి రక్షా బంధన్ రోజున తన కజిన్ బ్రదర్‌కు రాఖీ కట్టింది. దీని అర్థం తనకు జీవితాంతం రక్షగా ఉంటాడని.. కానీ ఆ సోదరుడే ఆమెపై లైంగిక దాడి చేశాడు. కనీసం రాఖీ కట్టిందనే ఆలోచన కూడా లేకుండా.. అదే రోజు సాయంత్రం బాలికను రేప్ చేశాడు. తన కామానికి చిన్నారిని బలి చేశాడు. చిన్నారి తల్లికి చెప్పడంతో ఈ విషయం బయటపడగా.. తల్లి ఫిర్యాదుతో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టగా.. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలిపారు. కాగా పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

Next Story