- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crime News : ఉదయం రాఖీ కట్టిన చెల్లి.. సాయంత్రం రేప్ చేసిన అన్న
రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక. ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఈ లోకమే కాదన్నా.. తాను రక్షణగా ఉంటానని అన్న, చెల్లికి ఇచ్చే హామీ రక్షా బంధన్. అందుకే ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆరోజు అన్నాదమ్ముల చేతికి రాఖీ కట్టాలని ప్రయత్నిస్తారు అక్కా చెల్లెళ్లు.

దిశ, వెబ్ డెస్క్ : రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక. ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఈ లోకమే కాదన్నా.. తాను రక్షణగా ఉంటానని అన్న, చెల్లికి ఇచ్చే హామీ రక్షా బంధన్. అందుకే ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆరోజు అన్నాదమ్ముల చేతికి రాఖీ కట్టాలని ప్రయత్నిస్తారు అక్కా చెల్లెళ్లు. కుదరకపోతే పోస్ట్‌లోనైనా రాఖీని పంపిస్తారు. కానీ ఇక్కడ అన్న రక్షకుడిగా కాదు భక్షకుడిగా మారాడు. తన కామవాంఛకు అభం శుభం తెలియని చిన్నారిని బలి తీసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఐదేళ్ల బిడ్డను తీసుకుని కజిన్ బ్రదర్‌కు రాఖీ కట్టేందుకు తీసుకెళ్లింది తల్లి. మధ్యాహ్నం పన్నెండు 45 నిమిషాలలోపు.. పౌర్ణమి ఘడియలు ముగియక మునుపే రాఖీ కట్టాలని పండితులు చెప్పడంతో.. ఉదయాన్నే అన్నకు రాఖీ కట్టింది ఐదేళ్ల చిన్నారి. కానీ అదే రోజు సాయంత్రం ఆ అన్న రక్షణ అందించడం మానేసి.. మద్యం మత్తులో పాపపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పాపకు నొప్పి రావడం, రక్తస్రావం కావడంతో తల్లికి జరిగిన కథను వివరించింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోక్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.






