ఘోరం.. నిద్రపోతుండగా భర్త మర్మాంగాలను కట్ చేసి పరారైన భార్య..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ అమేథీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జగదీష్‌పురలో భర్త మర్మాంగాలను కోసేసి పరారైంది భార్య. పెళ్లి జరిగిన ఎనిమిది నెలలకే ఈ ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఘోరం.. నిద్రపోతుండగా భర్త మర్మాంగాలను కట్ చేసి పరారైన భార్య..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ అమేథీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జగదీష్‌పురలో భర్త మర్మాంగాలను కోసేసి పరారైంది భార్య. పెళ్లి జరిగిన ఎనిమిది నెలలకే ఈ ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. భర్త అన్సార్ నిద్రపోతున్న సమయంలో భార్య నజ్నీన్ మర్మాంగాలను కట్ చేసింది. బాధితుడిని ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తుండగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అన్సార్‌కు ఇద్దరు భార్యలు సబేజూల్, నజ్నీన్. కాగా వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భార్తతో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో అతనికి మత్తు మందు ఇచ్చి ప్రైవేట్ భాగాలపై ఎటాక్ చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు దారితీసిన కారణమేంటనే దానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

Next Story