- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్జాతీయ వేదికపై భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక మధ్య ఉద్రిక్తలు తీవ్రమయ్యాయి. ఇస్లామాబాద్ పై భారత్ తీవ్ర ఆంక్షలు విధించింది. అయినప్పటికీ పాక్ మాత్రం తన బుద్ధిని మార్చుకోలేదు.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక మధ్య ఉద్రిక్తలు తీవ్రమయ్యాయి. ఇస్లామాబాద్ పై భారత్ తీవ్ర ఆంక్షలు విధించింది. అయినప్పటికీ పాక్ మాత్రం తన బుద్ధిని మార్చుకోలేదు. అంతర్జాతీయ వేదికపై పహెల్గాం ఉగ్రదాడిదృష్టిని మరల్చేందుకు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో, భారత్ గట్టిగా బదులిచ్చింది. అయితే, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ ఐక్యరాజ్య సమితి (United Nations) భద్రతా మండలిలో కీలక సమావేశం జరిగింది. ఇందులో పాక్ (Pakistan) పహెల్గాం ఉగ్రదాడిపై దృష్టి మరల్చేందుకు కశ్మీర్ అంశాన్ని (Kashmir Issue) లేవనెత్తింది. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు యూఎన్ భద్రతా మండలిలో అంతర్గత సమావేశం నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఇందులో ఎలాంటి తీర్మానం చేయలేదు. దీనిపై యూఎన్ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
పాక్ శాశ్వత ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు
అయితే, ఐక్యరాజ్యసమితిలో పాక్ శాశ్వత ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తిఖర్ ఈ భేటీలో మాట్లాడుతూ.. భారత్‌పై అక్కసు వెల్లగక్కారు. ఉగ్రదాడి (Pahalgam Terror Attack)పై ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు సమావేశంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దాయాది ఆరోపణలకు భారత్ గట్టిగా బదులిచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత మహమ్మది ఖిలారీ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరుదేశాల మధ్య పరిస్థితి అస్థిరంగా ఉంది. ఈ ఘర్షణాత్మక సమస్యకు చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం తీసుకురావాలని భద్రతా మండలి సభ్య దేశాలు పిలుపునిచ్చాయి’’ అని తెలిపారు. అయితే, ఈ చర్చలు ఫలప్రదమయ్యాయని భద్రతా మండలి అధ్యక్షుడు ఎవాన్‌గెలోస్ సెక్రీస్ వెల్లడించారు. ఈ సమావేశానికి కొన్ని గంటల ముందే యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెరస్ కీలక ప్రకటన చేశారు. ఉగ్రదాడి తర్వాత ప్రజల భావోద్వేగాలను తాను అర్థం చేసుకోగలనన్న ఆయన.. ఇందుకు సైనిక చర్య మాత్రం పరిష్కారం కాదని చెప్పుకొచ్చారు. పొరపాట్లు చేయొద్దని, సంయమనం పాటించాలని ఇరుదేశాలను కోరారు.






