UNO: ఉద్రిక్తతలు తగ్గించుకోండి.. భారత్ పాక్‌లకు ఐరాస సూచన

by B.Srinivas |

భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

UNO: ఉద్రిక్తతలు తగ్గించుకోండి.. భారత్ పాక్‌లకు ఐరాస సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ (India pakisthan) మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ (Antonio Guterres) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని, గతంలో ఎన్నడూ లేనంతగా ఉన్నాయని తెలిపారు. ఘర్షణ అదుపుతప్పే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ఇరు దేశాలు ఏ పొరపాటు చేయొద్దని, సైనిక చర్య పరిష్కారం కాదని సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు. బాధ్యులను చట్టబద్ధమైన మార్గాల ద్వారా శిక్షించాలి. భారత్ పాక్ దేశాలు సంయమనం పాటించాలని, ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి రెండు దేశాలు వెనక్కి తగ్గాలని కోరారు. ఇరు దేశాల సంబంధాలు ఈ దశకు చేరుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. దౌత్యం, శాంతి పునరుద్దరణకు తీసుకునే ఏ చొరవకైనా మద్దతు ఇవ్వడానికి ఐక్యరాజ్యసమితి సిద్ధంగా ఉందన్నారు.

Next Story