- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Unnao Rape Case: ఉన్నావో రేపు కేసు నిందితుడికి ఊరట.. 2 వారాల బెయిల్ మంజూరు
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో రేప్ కేసులో(Unnao Rape Case) దోషికి ఢిల్లీ హైకోర్టులో(Delhi High Court) ఊరట దక్కింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో రేప్ కేసులో(Unnao Rape Case) దోషికి ఢిల్లీ హైకోర్టులో(Delhi High Court) ఊరట దక్కింది. బీజేపీ బహిష్కృత నేత కుల్ దీప్ సింగ్ సెంగార్( Kuldeep Sengar) కు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2017లో మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో కుల్ దీప్ సెంగా జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అయితే, వైద్య కారణాలతో ఢిల్లీ హైకోర్టు ఆయనకు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అలానే ఢిల్లీ ఎయిమ్స్ లో అతడ్ని చేర్చాలని జస్టిస్ ప్రతిభా సింగ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. డిశ్ఛార్జి అయిన తర్వాత తప్పనిసరిగా ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించింది. అలానే, ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ బోర్డు నుంచి కోర్టు నివేదికను కోరింది. డిసెంబర్ 20కి తదుపరి విచారణను వాయిదా వేసింది.
మరో కేసు పెండింగ్
ఇకపోతే, ఉన్నావో అత్యాచార బాధితురాలి తండ్రి మృతికి సంబంధించిన కేసులోనూ సెంగాల్ పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ కేసులో మధ్యంతర బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్ మరో బెంచ్ ఎదుట పెండింగ్ లో ఉంది. మరోవైపు, ఈ పిటిషన్‌ను బాధితురాలి లాయర్‌తో పాటు సీబీఐ కూడా వ్యతిరేకించింది. అంతేకాకుండా, ఉన్నావో రేప్ కేసులో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సెంగార్ దాఖలు చేసిన అప్పీలు హైకోర్టులో పెండింగ్‌లోనే ఉంది. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడు 2017లో సెంగార్ ఆమెను కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. మార్చి 13, 2020న అత్యాచార బాధితురాలి తండ్రి పోలీసుల కస్టడీలో మరణించాడు. ఈకేసులో సెంగార్ పదేళ్ల కఠినకారాగాశిక్ష అనుభవిస్తున్నాడు. సెంగార్ సోదరుడు అతుల్ సింగ్ సెంగార్‌తో పాటు మరో ఐదుగురికి కూడా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.






