- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RSS టెర్రరిస్ట్ సంస్థనా ? ఐక్యరాజ్యసమితి రిపోర్ట్ ఏం చెప్తోంది?
RSS టెర్రరిస్ట్ సంస్థనా ? కాషాయ ఉగ్రవాదమా? దేశంలో కాషాయ భావజాలం పెరిగిందన్న ప్రతీసారి దీనిపై చర్చ జరుగుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితి అధికారిక లెక్కలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

దిశ, వెబ్‌డెస్క్: RSS టెర్రరిస్ట్ సంస్థనా ? దేశంలో కాషాయ భావజాలం పెరిగిందన్న ప్రతీసారి దీనిపై చర్చ జరుగుతోంది. అలాగే ఉగ్రవాదానికి మతం లేదని, సమాజంలో నెలకొనే పరిస్థితుల ఆధారంగానే కొందరు ఉగ్రవాదులుగా మారుతున్నారన్న వాదన కూడా ఉంది. మనం ఎంతోకాలంగా వింటూ వస్తోన్న ఈ రెండు విషయాల్లో వాస్తవమెంత? ఉగ్రవాదంపై ఇటీవల ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ఇందుకు సమాధానంగా కనిపిస్తోంది.
RSS అంటే కాషాయ ఉగ్రవాదమా?
ఐక్యరాజ్యసమితి (UNITED NATIONS) అధికారిక వెబ్‌సైట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదుల సంఖ్య, వారిలో ఏయే మతస్తులు ఎంతమంది ఉన్నారో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 726 మంది ఉగ్రవాదులు, 273 ఉగ్రవాద సంస్థలు, గ్రూపులు ఉన్నట్లు పేర్కొంది. ఈ లిస్టు ప్రకారం.. UN ప్రకటించిన 726 మంది ఉగ్రవాదుల్లో 702 మంది ముస్లింలు, 13 మంది క్రైస్తవులు, 11 మంది వామపక్ష భావజాలం కలిగిన కొరియన్లు ఉన్నారు. ఈ మొత్తం లిస్టులో ఒక్క హిందువు కానీ, ఆర్ఎస్ఎస్ సంస్థ పేరు కానీ, ఆ సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తి పేరు కానీ లేవు. దీనిని బట్టి చూస్తే RSS ఉగ్రవాద సంస్థ కాదని స్పష్టమవుతోంది. RSS అంటే హిందూ టెర్రరిజం అని, కాషాయ ఉగ్రవాదమని ప్రచారం చేసేవారు ఈ విషయం గురించి ఆలోచించాలి. ప్రపంచం గురించి ప్రతి విషయాన్ని పరిశీలించే ఐక్యరాజ్యసమితి వెలువరించిన ఉగ్రవాదుల లిస్టులో RSS పేరు లేదంటే.. అది ఉగ్రవాద సంస్థ కాదనే కదా అర్థం.






