- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ayodhya: అయోధ్య రామ్ మందిర్‌లో యూనిక్ క్లాక్.. ఒకేసారి ఏడు దేశాల సమయం తెలుసుకోవచ్చు.. ఇంకా మరెన్నో!
హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలోని రామ్ మందిర్ దేవస్థానానికి కానుకల వెల్లువ కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Ayodhya Ram Mandir) హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలోని రామ్ మందిర్ దేవస్థానానికి కానుకల వెల్లువ కొనసాగుతోంది. గత ఏడాది జనవరి 22న రామ్ లల్లా ప్రతిష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అయోధ్య నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మందిర్ గోపురాలకు బంగారు తాపడం పనులు కూడా తాజాగా కంప్లీట్ అవ్వడంతో భక్తులకు కనువిందు చేస్తున్నాయి. మరోవైపు అయోధ్య రామ మందిరంలో యూనిక్ క్లాక్ ఏర్పాటు చేయనున్నారు. ఏడు దేశాల సమయాన్ని ఒకేసారి తెలుసుకునేలా గడియారం రూపొందించారు. అయోద్యకు చెందిన కూరగాయల మార్కెట్ యజమాని అనిల్ కుమార్ టెంపుల్‌కి గడియారం బహుకరణ చేశారు. అనిల్ 25 ఏళ్లుగా వినూత్న ప్రత్యేకమైన ఆవిష్కరణలను సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ మందిర్ కోసం ఈ ప్రత్యేకమైన గడియారాన్ని రూపొందించారు. అతను గడియారాన్ని కేవలం రూ. 5 వేలకు రూపొందించినట్లు తెలిపారు. రామ్ లల్లా ప్రతిష్ట సమయంలో మొదటిదాన్ని బహుమతిగా ఇచ్చినట్లు చెప్పారు. మరొకటి తయారు చేయమని ఆలయ అధికారులు అతన్ని అడిగినట్లు తాజాగా మీడియాతో మాట్లాడారు. గడియారానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
రామ్‌మందిర్‌లో తెలంగాణలోని హైదరాబాద్ తన ప్రత్యేక ముద్ర వేసింది. జూన్ 5న, రామమందిర సముదాయంలో 14 కొత్త ఆలయాలు ప్రతిష్టించబడుతున్నాయి. మందిర్ మొదటి అంతస్తులో ఉండే రామ దర్బార్‌లో ప్రధాన ఆలయం మాదిరిగానే, కొత్త ఆలయాల (అయోధ్య రామాలయ ద్వారాలు) ద్వారాలను కూడా హైదరాబాద్‌కు చెందిన అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ కళాకారులు నిర్మించారు. ఈ ద్వారాలు చూడటానికి చాలా గొప్పగా, అందంగా ఉన్నాయి. దేశ సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రతిరూపాలు ఈ ద్వారాల మీద కన్పిస్తాయి. మహారాష్ట్ర నుంచి తెచ్చిన టేకు కలపతో నాగర్ శైలిలో తలుపులను హైదరాబాద్ కళాకారులు తమ చేతులతో చెక్కారు. కాగా, నేటి నుంచి 5 వరకు రామ మందిరం ప్రాంగణంలో వేడుకలు జరగనున్నాయి. ఆఖరి రోజున దేవుళ్ల విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు.






