- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maharashtra: కేంద్రమంత్రి కుమార్తెకు వేధింపులు.. కేసు నమోదు
మహారాష్ట్రలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే (Raksha Khadse) మైనర్ కుమార్తె లైంగిక వేధింపులకు గురయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే (Raksha Khadse) మైనర్ కుమార్తె లైంగిక వేధింపులకు గురయ్యారు. జల్‌గావ్ జిల్లా ముక్తాయ్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను కొందరు యువకులు వేధించారని (Harassment) పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మహారాష్ట్రలోని శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. రక్షా మాట్లాడుతూ.. ‘‘మహాశివరాత్రి సందర్భంగా కొథాలీలో యాత్ర నిర్వహిస్తారు. ఇటీవల నిర్వహించిన స్నేహితులతో కలిసి ఆ యాత్రకు వెళ్తానని నా కుమార్తె కోరడంతో సెక్యూరిటీ సాయంతో అక్కడకు పంపించాను. ఆ సమయంలో కొందరు యువకులు వారిని వెంబడించి వేధించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా దురుసుగా ప్రవర్తించారు. గుజరాత్ పర్యటన నుంచి నేను ఇంటికి రాగానే మా అమ్మాయి ఈ విషయం చెప్పింది. ఓ ఎంపీ లేదా కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సాధారణ మహిళల సంగతి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనపైనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశా’’ మీడియాకు తెలిపారు.
ఒకరు అరెస్టు
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నిందుతులకు ఓ రాజకీయ పార్టీతో సంబంధాలున్నాయని.. కొందర్ని అరెస్టు చేశారని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా.. ఈ ఘటన తర్వాత అధికార మహాయుతిపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్దన్ సప్కాల్ మాట్లాడుతూ.. మహాయుతి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. కాగా.. ముక్తాయ్ నగర్ డీఎస్పీ కుషానత్ పింగ్డే ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఏడుగురు నిందితులను గుర్తించామన్నారు. అందులో ఒకర్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ నిందితులందరూ అనేకమంది బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. అలానే, కేంద్రమంత్రి కుమార్తెతోనూ దురుసుగా ప్రవర్తించారని.. ఆమె సెక్యూరిటీ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారితో కూడా ఘర్షణ పడ్డారని అన్నారు. అంతేకాకుండా, లైంగిక వేధింపులకు సంబంధించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు బాలికల వీడియోలు తీసినందుకు ఐటీ చట్టం కింద కూడా అభియోగాలు నమోదు చేశామన్నారు.






