- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దెబ్బకు దెబ్బకు కొట్టిన కాంగ్రెస్.. ఆమేథిలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఘోర ఓటమి
కంచుకోటలో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్టీకి పెట్టని కోటగా ఉన్న ఆమేథీలో తిరిగి కాంగ్రెస్ జయకేతనం ఎగరేసింది. కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ చేతిలో

దిశ, వెబ్ డెస్క్: కంచుకోటలో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్టీకి పెట్టని కోటగా ఉన్న ఆమేథీలో తిరిగి కాంగ్రెస్ జయకేతనం ఎగరేసింది. కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ చేతిలో కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థిని స్మృతి ఇరానీ ఘోర ఓటమి చవిచూశారు. దాదాపు లక్ష ఓట్ల పై చిలుకు తేడాతో స్మృతి ఇరానీ పరాజయం మూటగట్టుకున్నారు. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే స్థానంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించి దేశ రాజకీయాల్లో సెన్సేషన్ సష్టించారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి అయిన రాహుల్ గాంధీపై గెలవడంతో దేశవ్యాప్తంగా స్మృతి ఇరానీ పేరు మారుమోగిపోయింది. రాహుల్ గాంధీపై విజయం సాధించడంతో స్మృతి ఇరానీని కేంద్రమంత్రి పదవి సైతం వరించింది. తాజా ఎన్నికల్లో మరోసారి స్మృతి ఇరానీ ఆమేథీ నుండి బరిలోకి దిగగా.. కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీని కాకుండా మరో బలమైన నేత కిశోరీలాల్ శర్మను పోటీకి దించింది. బీజేపీపై వ్యతిరేకతతో పాటు గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కలిసి రావడం కంచుకోటలో కాంగ్రెస్ మరోసారి జెండా ఎగరేసింది.






