- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు అదిరిపోయే శుభవార్తను అందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దేశ రైతులకు శుభావార్తను అందించారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Minister Shivraj Singh Chouhan) దేశ రైతులకు శుభావార్తను అందించారు. చాలా కాలంగా ఫసల్ బీమా యోజనలో కవర్ కాకుండా.. ఉన్న కీలక విపత్తులు అయిన రెండింటిపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. "నేను ఈ రోజు మీకు శుభవార్త ఇస్తున్నాను. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద రెండు నష్టాలు కవర్ కావడం లేదు. వీటిపై చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకటి, అడవి జంతువుల వల్ల పంటలకు నష్టం.
రెండు వరదలు లేదా అధిక వర్షపాతం, నీటి ఎద్దడి కారణంగా పంటలకు నష్టం. ఈ రెండు నష్టాలను ఇప్పుడు ఫసల్ బీమా యోజన కింద కవర్ చేస్తున్నట్లు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అడవి జంతువులు పంటలను దెబ్బతీస్తే, దానికి పరిహారం చెల్లించబడుతుంది. నీటి ఎద్దడి కారణంగా పంటలు దెబ్బతిన్నట్లయితే, దానికి పరిహారం చెల్లించబడుతుంది..." అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశంలోని రైతులతో పాటు తెలుగు రాష్ట్రాల రైతులకు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.






