- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video : చిందేసిన శివరాజ్ సింగ్ చౌహాన్.. కారణం ఇదే!
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ మరి ఆయన ఎందుకు సంతోషంగా డ్యాన్స్(Dance) చేశారు అంటే.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చిన్న కుమారుడు కునాల్ చౌహాన్‌కు భోపాల్‌కు చెందిన డాక్టర్ ఇందెర్మల్ జైన్ మనవరాలు రిధి జైన్‌తో పెళ్లి జరుగనున్నది. ఈ నేపథ్యంలో గురువారం హల్దీ వేడుకలో శివరాజ్ సింగ్ చౌహాన్ తన డ్యాన్స్ తో సందడి చేశారు. తన భార్య సాధనా సింగ్‌తో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చిన్న కుమారుడు కునాల్ చౌహాన్, రిధి జైన్ జంటకు గత ఏడాది మే 23న నిశ్చితార్థం చాలా సింపుల్‌గా జరిగింది. ప్రస్తుతం ఆయన నివాసంలో జరుగుతున్న కుమారుడి పెళ్లి వేడుకకు సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు, బీజేపీ పార్టీ నేతలు హాజరవనున్నారు.






