Ransom Threat : నాకు హత్య బెదిరింపు వచ్చింది.. రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : తనకు హత్య బెదిరింపు వచ్చిందని రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ (రాంచీ ఎంపీ) తెలిపారు.

Ransom Threat : నాకు హత్య బెదిరింపు వచ్చింది.. రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్
X

దిశ, నేషనల్ బ్యూరో : తనకు హత్య బెదిరింపు వచ్చిందని రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ (రాంచీ ఎంపీ) తెలిపారు. రూ.50 లక్షలు(Ransom Threat) ఇవ్వకుంటే హత్య చేస్తామంటూ గుర్తు తెలియని దుండుగుల నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చిందని ఆయన చెప్పారు. దీని గురించి ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ డీజీపీకి శుక్రవారమే ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ అంశంపై దర్యాప్తు చేసి బెదిరింపు సందేశాన్ని పంపిన దుండగులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ బెదిరింపులకు తాను ఏ మాత్రం భయపడటం లేదని సంజయ్ సేథ్(Sanjay Seth) స్పష్టం చేశారు.

రక్షణశాఖ సహాయ మంత్రి(Union Minister)కి వచ్చిన బెదిరింపులపై దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని జార్ఖండ్‌లోని ఇండియా కూటమి ప్రభుత్వాన్ని రాంచీ ఎమ్మెల్యే సి.పి.సింగ్ (బీజేపీ) డిమాండ్ చేశారు. జార్ఖండ్‌లో పర్యటించినప్పుడు సంజయ్ సేథ్‌కు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకొని, దర్యాప్తు చేయించాలని జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్ సిన్హా కోరారు. రక్షణశాఖ సహాయ మంత్రికి బెదిరింపుల వెనుక ఎవరున్నారు అనేది గుర్తించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపాలన్నారు.

Next Story