అహ్మదాబాద్‌లో కూలిన ఫ్లైట్..రంగంలోకి కేంద్ర మంత్రి రామ్మోహన్

by velandi.Saikiran |

గుజరాత్ ( Gujarat) అహ్మదాబాద్ లోని ( Ahmedabad) సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం ( Sardar Vallabhbhai Patel Airport)

అహ్మదాబాద్‌లో కూలిన ఫ్లైట్..రంగంలోకి కేంద్ర మంత్రి రామ్మోహన్
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ ( Gujarat) అహ్మదాబాద్ లోని ( Ahmedabad) సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం ( Sardar Vallabhbhai Patel Airport) నుంచి గురువారం లండన్ బయలుదేరిన విమానం కుప్పకూలింది. ప్రమాదవశాత్తు.. నెంబర్ ఏఐ 171 అనే విమానం ( Air India AI-171 aircraft).. ఒక్కసారి మంటలు చెలరేగి కూలిపోయింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ ప్రమాద సంఘటన హాట్ టాపిక్ అయింది. ఈ విమాన ప్రమాద సమయంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు.

రన్ వే నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి.. ఈ ప్రమాదం జరిగినట్లు ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ప్రమాద సమయంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ( Vijay Rupani) కూడా అందులోనే ఉన్నట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే.. క్షతగాత్రులను అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు మొత్తం తొమ్మిది ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి.

ఇక ఈ ప్రమాద సంఘటన తెలియగానే.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ( Rammohan Naidu) సంఘటన స్థలానికి బయలుదేరారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ వెళ్తున్నారు. అటు ఇప్పటికే ఈ ప్రమాద సంఘటన గురించి ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేసినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story