దేశంలో మళ్లీ లాక్‌డౌన్.. వార్తలపై స్పందించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

by Ramesh Naini |

దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు.

దేశంలో మళ్లీ లాక్‌డౌన్.. వార్తలపై స్పందించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం రాజ్యసభలో 2026 ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి ఆధార రహితమైన ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో కోవిడ్ తరహా పరిస్థితులు మళ్లీ రావని, ఇంధన కొరత ఏర్పడుతుందనే వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘లాక్‌డౌన్ ఎక్కడ జరుగుతోంది? అది పాకిస్తాన్‌లో జరుగుతోంది, భారత్‌లో కాదు’ అని ఆమె స్పష్టం చేశారు. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న పరిణామాల వల్ల కొంత ప్రభావం ఉన్నప్పటికీ, దేశ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వనరులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు మంచి మిత్రుడిగా అడిగిన సహాయం అందిస్తున్నామని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

Next Story