Kumaraswamy : కేంద్రమంత్రి కుమార స్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!

by Y. Venkata Narasimha Reddy |

జేడీఎస్ సీనియర్ నేత, కేంద్రమంత్రి హెచ్ డి.కుమారస్వామి(Union Minister Kumaraswamy)కి సుప్రీంకోర్టు(Supreme Court)లో చుక్కెదురైంది.

Kumaraswamy : కేంద్రమంత్రి కుమార స్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!
X

దిశ, వెబ్ డెస్క్ : జేడీఎస్ సీనియర్ నేత, కేంద్రమంత్రి హెచ్ డి.కుమారస్వామి(Union Minister Kumaraswamy)కి సుప్రీంకోర్టు(Supreme Court)లో చుక్కెదురైంది. తనపై ఉన్న అవినీతి కేసులో విచారణను రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కర్ణాటక హైకోర్టు నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, రాజేష్ బిందాల్ లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.

బెంగుళూరు దక్షిణ తాలూకాలోని ఉత్తరహళ్లి హోబీలోని హలగేవడేరహళ్లి గ్రామంలోని రెండు ప్లాట్లను కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక ఉద్దేశాలతో డీనోటిఫై చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. బీడీఏ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ... ముఖ్యమంత్రిగా కుమారస్వామి 2007లో ఆ భూమిని డీ-నోటిఫై చేయాలని ఆదేశించారని.. ఆ తర్వాత 2010లో ఆ భూమిని ప్రైవేట్ పార్టీలకు రూ.4.14 కోట్లకు విక్రయించినట్లుగా కాంగ్రెస్ ఆరోపించింది. అలాగే బళ్లారి జిల్లాలో శ్రీ సాయి వెంకటేశ్వర మినరల్స్ మైనింగ్ కేసులో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది.

న్యాయస్థానాల్లో కుమారస్వామికి ఉపశమనం లభించకపోవడంతో, కర్ణాటక పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. దీనిపై ఇప్పటికే ఓ కేసు విచారణలో ఉన్నందున ఆయనను విచారించడానికి అనుమతి ఇవ్వాలని(Permission for investigatio) సిట్(Sit)బృందం గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్(Governor Thawar Chand Gehlot)కు విజ్ఞప్తి చేసింది. దీంతో కన్నడ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.

అయితే చార్జిషీట్ కన్నడలో ఉందని, ఆంగ్లంలోకి అనువదించి అందజేయాలని రాజ్ భవన్ అధికారులు సూచించారు. దీంతో సుమారు 4,500 పేజీల చార్జిషీట్ ను ఇంగ్లీష్ లోకి మార్చి సమర్పించారు. గవర్నర్ విచారణకు అనుమతి ఇస్తే సిట్ అధికారుల ముందు కుమారస్వామి విచారణకు హాజరుకావలసి ఉంటుంది. ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే మైసూరు అర్భన్ డెవలప్మెంట్ అథార్టీ(ముడా) భూముల వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన సతీమని పార్వతిపై గవర్నర్ విచారణకు అనుమతినివ్వడం..లోకాయుక్త విచారణ జరుగడం విదితమే. అక్రమార్కుల కేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా లోకాయుక్త విచారణ ఎదుర్కొన్నారు. వారిద్ధరికి ఆయా కేసుల్లో ఊరట లభించింది.

Next Story