- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏఐసీసీ నేత సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు.

దిశ వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏఐసీసీ నేత సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు. అందులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అందులో ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారా..? వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నించారా..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, తాజాగా విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త పల్లవి అందుకున్నారని, గతంలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా అంటూ సోనియా గాంధీని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, ఇచ్చిన మాటపై నిలబడకపోతే.. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, అభయహస్తం పేరుతో ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి భస్మాసుర హస్తం గా మారుతాయని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తన బహిరంగ లేఖలో రాసుకొచ్చారు.






