మెక్‌డొనాల్డ్స్‌లో "మిల్లెట్‌ బన్‌ బర్గర్‌”.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆసక్తికరమైన ట్వీట్

by Malleboina Mahesh |   (  Updated:2025-11-02 12:44:01  IST  )

విదేశీ వస్తువులు వద్దు.. స్వదేశీ వస్తువులే ముద్దు అనే నినాదం భారత్ లో నెమ్మది నెమ్మదిగా బలపడుతుంది. ఈ క్రమంలో మెక్‌డొనాల్డ్స్‌లో భారత సాంకేతికతకు గుర్తింపు పొందిన వాటిని అమ్మడంపై కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

మెక్‌డొనాల్డ్స్‌లో మిల్లెట్‌ బన్‌ బర్గర్‌”.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆసక్తికరమైన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: విదేశి వస్తువు వద్దు.. స్వదేశి వస్తువులే ముద్దు అనే నినాదం భారత్ లో నెమ్మది నెమ్మదిగా బలపడుతుంది. ఈ క్రమంలో మెక్‌డొనాల్డ్స్‌ (McDonald's)లో భారత సాంకేతికతకు గుర్తింపు పొందిన వాటిని అమ్మడంపై కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్ (Union Minister Dr. Jitendra Singh) ఆసక్తికరమైన్ ట్వీట్ చేశారు. "అంతర్జాతీయ ఆహార దిగ్గజం మెక్‌డొనాల్డ్స్‌ ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చేసిన సాంకేతికతతో తయారైన “మిల్లెట్‌ బన్‌ బర్గర్‌”**ను అందిస్తోంది. ఈ ప్రత్యేక బర్గర్‌ను మైసూరులోని CSIR - సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CFTRI) రూపొందించిన స్థానిక మిల్లెట్‌ ఆధారిత సాంకేతికతతో తయారు చేశారు.

డాక్టర్‌ జితేంద్ర సింగ్ ఈ సందర్భాన్ని “Videshi turns to Swadeshi” అని పేర్కొంటూ, ఇది భారత ఆవిష్కరణలు, సంప్రదాయ పోషకాహారం ప్రపంచ ఆహార ధోరణులను మారుస్తున్న అద్భుత ఉదాహరణగా పేర్కొన్నారు. 2023ను ఐక్యరాజ్యసమితి “అంతర్జాతీయ మిల్లెట్స్‌ సంవత్సరం”గా ప్రకటించడం ద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రోత్సాహానికి ఇది పెద్ద నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విజయంతో భారత మిల్లెట్‌ ఉద్యమానికి (Indian Millet Movement) అంతర్జాతీయ స్థాయిలో మరింత గౌరవం లభించింది.

Next Story