పాకిస్తాన్‌కు మూడు దేశాల సపోర్ట్ ఉంది.. పార్లమెంట్‌లో జైశంకర్ షాకింగ్ ప్రకటన

by Gantepaka Srikanth |

ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్(S. Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్‌కు మూడు దేశాల సపోర్ట్ ఉంది.. పార్లమెంట్‌లో జైశంకర్ షాకింగ్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్(S. Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ.. ఐక్య రాజ్య సమితిలో మనతో పాటు మరో 193 దేశాలకు సభ్యత్వం ఉంటే.. అందులో కేవలం మూడు దేశాలు మాత్రమే పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌(Pakistan)తో ఆ మూడు దేశాలకు కూడా గట్టి హెచ్చరిక చేశామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో మనం దాడులు చేయడం మొదలు పెట్టిన తర్వాత.. ఎన్నోసార్లు ఆపేయాలని పాక్ వేడుకున్నదని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో కల్లోలం సృష్టించాలని ఉగ్రవాదులు చూశారు. పర్యాటక రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు.

ఎప్పటికీ ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని అన్నారు. ఉగ్రదాడిని ఐరాస భద్రతా మండలి కూడా ఖండించిందని ఈ సందర్భంగా జైశంకర్ గుర్తుచేశారు. మరోవైపు.. పెహల్గాంలో దాడులకు పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించుకుందని అన్నారు. గతంలోనే టీఆర్ఎఫ్‌ను అమెరికా ప్రపంచ ఉగ్రసంస్థగా ప్రకటించిందని తెలిపారు. టీఆర్ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించడంలో కృషి చేసిన అధికారులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌కు ముందు భారత సైనికులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, పాకిస్తాన్‌లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు జరిపారని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో వంద మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు.

Next Story