- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హలో.. నేను జోహో మెయిల్‌కు మారాను :హోంమంత్రి అమిత్ షా పోస్ట్
భారతీయులంతా స్వదేశీ ఉత్పత్తుల్ని, సేవలను వాడాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మోదీ పిలుపు మేరకు కేంద్రమంత్రులు స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: భారతీయులంతా స్వదేశీ ఉత్పత్తుల్ని, సేవలను వాడాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మోదీ పిలుపు మేరకు కేంద్రమంత్రులు స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా.. జోహో ప్లాట్ ఫామ్ వైపు మొగ్గుచూపుతున్నారు. అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ జోహో సేవలను వినియోగిస్తుండగా.. తాజాగా కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా జోహో మెయిల్ కి మారినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. "హలో నేను జోహో మెయిల్ కు మారాను. నా ఈమెయిల్ అడ్రస్ లో ఈ మార్పును గమనించవచ్చు. [email protected] నా కొత్త మెయిల్ అడ్రస్" అని ఆ పోస్టులో తెలిపారు. ఇకపై తనకు మెయిల్స్ పంపాలనుకునేవారంతా కొత్త మెయిల్ అడ్రస్ కే పంపాలని అమిత్ షా సూచించారు.
జీమెయిల్, మైక్రోసాఫ్ట్ అవుట్ లుక్ కు పోటీగా జోహో మెయిల్ అందుబాటులోకి రాగా.. మెసేజింగ్ కోసం అరట్టైను రూపొందించారు. దీనినే అందరూ వాడాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సూచించారు. త్వరలోనే యూజర్ల ప్రైవసీ దృష్ట్యా అరట్టై లో ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని జోహో కో ఫౌండర్ శ్రీధర్ వెంబు తెలిపారు.






