దేశ వ్యతిరేక పోస్టులపై కేంద్ర హోంశాఖ సీరియస్..త్వరలో కొత్త పాలసీ?

by Ajay Maddhiboyina |

దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర హోంశాఖ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

దేశ వ్యతిరేక పోస్టులపై కేంద్ర హోంశాఖ సీరియస్..త్వరలో కొత్త పాలసీ?
X

దిశ, వెబ్ డెస్క్: దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర హోంశాఖ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ఓ కొత్త పాలసీని సైతం తీసుకురాబోతున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రియేటర్లు పెట్టే కంటెంట్ పరిశీలించి, దేశ వ్యతిరేక పోస్టులు పెడుతున్నవారిని గుర్తించేందుకు ఓ టీమ్‌ను సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలా పోస్టులు పెడుతున్నవారి అకౌంట్స్ బ్లాక్ చేయడమే కాకుండా వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తుస్తోందట. అయితే కేంద్రం చాలా కాలంగా సోషల్ మీడియాపై నియంత్రణ తీసుకువస్తామని చెబుతోంది. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో కొంతమంది యూట్యూర్లు, నెటిజన్లు పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతూ పోస్టులు పెట్టడంతో వారిపై సైతం నిఘా పెట్టి చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో వ్యతిరేక పోస్టులపై పాలసీ తీసుకువస్తే ఎల్లప్పుడు నిఘా పెట్టవచ్చని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Next Story