Police Medals : పోలీస్ పతకాలను ప్రకటించిన కేంద్ర హోం శాఖ

by Y. Venkata Narasimha Reddy |

గణతంత్ర దినోత్సవం(Republic Day) పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ పోలీసు శాఖకి సంబంధించిన ఉత్తమ సేవా పతకాలను ప్రకటించింది.

Police Medals : పోలీస్ పతకాలను ప్రకటించిన కేంద్ర హోం శాఖ
X

దిశ, వెబ్ డెస్క్ : గణతంత్ర దినోత్సవం(Republic Day) పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ పోలీసు శాఖకి సంబంధించిన ఉత్తమ సేవా పతకాలను ప్రకటించింది. స్వాంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఏటా కేంద్రం ఈ పోలీస్ పతకాలను అందిస్తుంది. ఈ దఫా దేశ వ్యాప్తంగా మొత్తం 942 మందికి గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్యాలంట్రీ పతకాలను అందజేయనుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది ఎంపికయ్యారు.

దేశవ్యాప్తంగా పోలీసు(Police), ఫైర్‌ సర్వీస్‌(Fire Service), హోంగార్డ్‌(Home Guard), సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు(Civil Defence Officers) గ్యాలంట్రీ పతకాలను అందజేయనుంది. ఇందుకోసం ఎంపికైన వారి జాబితను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 942 మందికి గ్యాలంట్రీ పతకాలను అందజేయనుంది. ఇందులో 95 మందికి మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, ఇద్దరికీ ప్రెసిడెంట్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, 101 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 746 మందికి పోలీస్‌ విశిష్ఠ సేవా పతకాలను కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

గ్యాలంట్రీ పతకాల జాబితాలో హైదరాబాద్ లా అండర్ ఆర్డర్ సీపీ విక్రమ్ సింగ్, ఎస్పీ మాణిక్యరాజులకు ప్రెసిడెంట్ మెడల్ కు ఎంపిక చేశారు. భారతీయులను కాపాడిన పాక్ అధికారికి పౌర పురస్కారం అందించాలని కేంద్రం నిర్ణయించడం విశేషం. గతేడాది హజ్ యాత్రలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా యాత్రికులకు తీవ్ర ఇక్కట్ల ఎదురైన నేపథ్యంలో దాదాపు 1300 మంది మృతి చెందారు. ఆ సమయంలో మీనాలో హజ్ అసిస్టెంట్ గా విధుల్లో ఉన్న పాకిస్థాన్ కు చెందిన ఆసిఫ్ బషీర్ అధిక ఉష్ణోగ్రతల కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన పలువురు యాత్రికులకు తన బృందంతో కలిసి ప్రథమ చికిత్స అందించిన రక్షించారు. 17 మంది భారతీయులు సహా 26 మందిని భుజాలపై ఎత్తుకుని ఆస్పత్రికి తరలించి బషీర్ వారి ప్రాణాలు కాపాడారు.

Next Story