చెప్పిన డేట్‌కే నక్సలిజాన్ని అంతం చేస్తాం: అమిత్ షా

by Gantepaka Srikanth |

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పుర్‌లో పర్యటిస్తున్నారు.

చెప్పిన డేట్‌కే నక్సలిజాన్ని అంతం చేస్తాం: అమిత్ షా
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పుర్‌లో పర్యటించారు. మార్చి 31 నాటికి నక్సలిజాన్ని(Naxalism) తుడిచిపెడతామమని అమిత్ షా ప్రకటించిన డెడ్‌లైన్ ముగుస్తుండటంతో.. ఆదివారం అధికారులో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై సుదీర్ఘంగా చర్చించారు. కగార్ ఆపరేషన్ చర్యలు సత్ఫలితాలిచ్చాయని అమిత్‌ షా అధికారులను ప్రశంసించారు. మార్చి 31లోపు నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని ఈ సందర్భంగా అమిత్ షా మరోసారి పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల నిధులను అడ్డుకోవడం, లొంగుబాటు చర్యలు, భద్రతా దళాల ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు మావోయిస్టుల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించాయన్నారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్ సాయి, డీసీఎం విజయ్ శర్మ, కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఛత్తీస్‌గఢ్ పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో 2024 నుంచి 500 మందికిపైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అగ్రనేత నంబాల కేశవరావు కూడా ఉన్నారు. ఈ రెండేళ్ల కాలంలో వందల సంఖ్యలో అరెస్టయ్యారు. 2,500 మందికిపైగా లొంగిపోయారు.

Next Story