- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర రక్షణశాఖ మంత్రికి కోవిడ్ పాజిటివ్
by Sathputhe Rajesh |
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,591 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కూడా కరోనా సోకినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. వాస్తవానికి ఆయన గురువారం న్యూఢిల్లీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌కు హాజరుకావాల్సి ఉంది. అయితే కరోనా బారిన పడటంతో ఆ ఈవెంట్‌కు దూరం అయినట్లు రాజ్‌నాథ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వైద్యుల బృందం అయనను పరీక్షించి విశ్రాంతి తీసుకోవాలని సూచించింది.
Next Story






