ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. ఢిల్లీ మెట్రో విస్తరణకు రూ.12,015 కోట్లు కేటాయింపు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-24 10:05:46  IST  )

ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ కాసేపటి క్రితం ముగిసింది.

ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. ఢిల్లీ మెట్రో విస్తరణకు రూ.12,015 కోట్లు కేటాయింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ కాసేపటి క్రితం ముగిసింది. సమావేశంలో ప్రధానంగా ఢిల్లీ మెట్రో (Delhi Metro) విస్తరణకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రూ.12,015 కోట్లు కేటాయింపుతో ఢిల్లీ మెట్రో ఫేజ్-4 విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) వెల్లడించారు.

అయితే, ఢిల్లీ మెట్రో ఫేజ్-4లోని మిగిలిన కీలక కారిడార్లు అయిన రిథాలా-బర్వాలా-నరేలా-కుండ్లీని కలుపుతుంది. ఇందులో భాగంగా మొత్తం 16 కి.మీ మేర 10 అండర్‌ గ్రౌండ్‌, 3 ఎలివేటెడ్‌ స్టేషన్లతో మెట్రోను విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఢిల్లీ, హర్యానా మధ్య కనెక్టివిటీ మెరుగుపడి, రహదారులపై రద్దీ భారీగా తగ్గుతుందని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ మధ్య మొదటి మెట్రో లైన్‌గా రెడ్ లైన్ మారనుంది. షహీద్ స్థల్ నుంచి నాథుపూర్ వరకు భారీ కనెక్టివిటీ ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మెట్రో ఫేజ్-4 ప్రాజెక్ట్ పనులు నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Next Story