కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం.. మారనున్న కేరళ రాష్ట్రం పేరు?

by Kema Shiva Kumar |

కేరళ పేరును 'కేరళం'గా మారుస్తూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానంపై కేంద్ర మంత్రివర్గం నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం.. మారనున్న కేరళ రాష్ట్రం పేరు?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ’లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, తదితరులు పాల్గొన్నారు. ఇవాళ్టి భేటీలో ప్రధానంగా కేరళ అసెంబ్లీ ఎన్నికల మందు ఆ రాష్ట్ర పేరును ‘కేరళం’ (Keralam)గా పేరు మార్చాలని కోరుతూ దాఖలైన విజ్ఞప్తిని మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానాన్ని చేసి కేబినెట్‌లో ఆమోదించింది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న అన్ని భాషల్లో రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

అయితే, మలయాళంలో కేరళ రాష్ట్రాన్ని ‘కేరళం’ అని పిలుస్తారు. కానీ రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో ‘కేరళ’ అని ఉంది. ఆ తప్పును సరిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రం పేరును మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మే లోపు కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోనుంది.

Next Story