కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-14 06:01:45  IST  )

కాల్పులు విమరణ తరువాత తొలిసారిగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ (Central Cabinet Meeting) సమావేశమైంది.

కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: కాల్పులు విమరణ తరువాత తొలిసారిగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ (Central Cabinet Meeting) సరిగ్గా 11 గంటలకు సమావేశమైంది. ఈ భేటీలో ప్రధానితో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా సరిహద్దుల్లో కాల్పుల విరమణపై తాజా పరిస్థితిపై చర్చించనున్నారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK), పాకిస్తాన్‌కు చైనా ఆయుధాల సరఫరా, అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా (China) మార్చడం వంటి అంశాలు చర్చకు రానున్నట్లుగా తెలుస్తోంది. ‘ఆపరేషన్ సిదూర్‌’ (Operation Sindoor)పై ప్రధానం చర్చించి ప్రధానికి అభినందనలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేయనున్నారు. అదేవిధంగా పహల్గాం టెర్రర్ అటాక్‌లో మృతి చెందిన పర్యాటకులను అమర వీరులుగా గుర్తించాలన్ని విజ్ఞప్తులపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. వీర మరణం పొందిన జవాన్లు, రక్షణ బలగాల అధికారులకు సరైన గౌరవం ఇచ్చే అంశంపై సమావేశంలో డిస్కస్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమరణ, పాక్ ఆక్రమిత అంశాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించనున్నారు.

Next Story