- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Union Budget-2025: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతోంది.. ప్రెసిడెంట్ ముర్ము కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget Sessions of Parliament) అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget Sessions of Parliament) అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi), ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankhar), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla)తో కలిసి పార్లమెంట్‌లోకి ఎంటర్ అయ్యారు. ముఖ్యంగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు సెంగోల్ (Sengol)లో లాంఛన స్వాగతం లభించింది. అనంతర ఉభయ సభలకు ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. భారత సామాజిక చేతనుకు మహా కుంభమేళా నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. తమ ప్రభుత్వ మూడో టర్మ్‌లో మూడు రెట్ల వేగంతో అభివృద్ధి జరుగుతోందని కొనియాడారు. మూడు కోట్ల పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా దేశాభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రూ.70 వేల కోట్లను కేటాయించామని పేర్కొన్నారు.
దేశాభివృద్ధి ఫలాలలు అందరికీ అందాలనే తమ తపత్రయమని తెలిపారు. 25 కోట్ల మందిని పేదరికమనే ఊబి నుంచి బయటకు తీసుకువచ్చామని అన్నారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ (One Nation - One Election) దిశగా అడుగులు వేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగులు కోసం 8వ వేతన సంఘాన్ని నియమించామని గుర్తు చేశారు. మూడు లక్షల మంది మహిళలను లక్‌పతీ దీదీగా మార్చాలన్నదే తమ సంకల్పమని అన్నారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.






